'భగవాన్ బిర్సా ముండా చూపిన మార్గం ఆదర్శనీయం'

'భగవాన్ బిర్సా ముండా చూపిన మార్గం ఆదర్శనీయం'

VKB: భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకుని శనివారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ నివాళులర్పించారు. జిల్లా అధికారులు, విద్యార్థులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా లింగ్యా నాయక్ మాట్లాడుతూ.. బిర్సా ముండా చూపిన మార్గం ఆదర్శనీయమని, ప్రతి ఒక్కరూ మహనీయుల స్ఫూర్తితో భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని కోరారు.