కేటీఆర్‌కు మద్దతుగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు

SRD: ఫార్ములా ఈ రేస్ కేసులో నేడు విచారణకు హాజరవుతున్న కేటీఆర్‌కు మద్దతుగా నారాయణఖేడ్ నుంచి బీఆర్ఎస్ శ్రేణులు హైదరాబాద్ తరలి వెళ్లారు. మాజీ జడ్పీటీసీ రాథోడ్ లక్ష్మీబాయి మాట్లాడుతూ.. కేటీఆర్‌పై కాంగ్రెస్ కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. కాళేశ్వరంలో అవకతవకల ప్రచారంపై ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో మళ్లీ ఫార్ములా ఈ రేస్‌పై తిరిగి విచారణ చేస్తున్నారని విమర్శలు చేశారు.