ట్రాక్టర్‌ను ఢీ కొన్న కారు.. ఇరువురికి తీవ్రగాయాలు

ట్రాక్టర్‌ను ఢీ కొన్న కారు.. ఇరువురికి తీవ్రగాయాలు

MNCL: చెన్నూర్ బైపాస్ రోడ్డులోని పత్తి గట్టయ్య షాప్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి ట్రాక్టర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో దుర్గం రాజు, సుమన్ రావు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.