చప్పడి: పాఠశాల విద్యార్థుల ఆకలి కేకలు

విశాఖపట్నం: కోనాపురం పంచాయతి చప్పడి గ్రామంలో ఉన్న మండల పరిషత్ పాఠశాలలో చదువుతున్న 35 మంది విద్యార్థులు శనివారం ఆకలి కేకలతో ప్లేట్లు పట్టుకొని ఆందోళన చేపట్టారు. ప్రధాన ఉపాధ్యాయులు శెట్టి రాజు మాట్లాడుతూ.. మూడు నెలల నుండి జీసీసీ బియ్యం అందక మధ్యాహ్నం భోజనం పెట్టడం లేదని తెలిపారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు