కొండగట్టు భక్తులపై పూజల భారం
JGL: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో పూజల టిక్కెట్ల ధరలు పెంచనున్నట్లు ఆలయ ఈవో శ్రీకాంతరావు వెల్లడించారు. ఆర్జిత సేవల టిక్కెట్ల ధరలను పెంచేందుకు దేవాదాయశాఖ కమిషనర్ ఆమోదం తెలిపినట్లు ఈవో తెలిపారు. ఈనెల 15 నుంచి పెంచిన టిక్కెట్ల ధరలు అమలులోకి వస్తాయని, ఆలోగా భక్తుల స్పందనను గమనించడానికి శని, మంగళవారాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు వివరించారు.