మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి: ఎమ్మెల్యే

మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి: ఎమ్మెల్యే

ATP: అమరావతిలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సూచించారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సమైక్య ఆధ్వర్యంలో డిసెంబర్ 13న గుంటూరు హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఈ మేళా జరుగనుంది. ఇందులో 50కి పైగా కంపెనీలు పాల్గొననున్నాయి. అర్హులైన యువత నవంబర్ 23 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని  ఎమ్మెల్యే సూచించారు.