ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోండి

ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోండి

GNTR: ప్రశాంత వాతావరణంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని టూ టౌన్ సీఐ ఏ. సుధాకర్ తెలిపారు. శనివారం తెనాలి పట్టణంలోని ఐతానగర్ ఎన్ఎస్ఎస్ఎం హైస్కూలులో పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ స్థానికులను ఉద్దేశించి మాట్లాడారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలంతా ధైర్యంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.