ఏనుగొండ దళితవాడలో పర్యటించిన అ. కలెక్టర్
MBNR: మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని ఏనుగొండ దళితవాడలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో TS MRPS దక్షిణ తెలంగాణ అధ్యక్షులు మల్లెపూవు శ్రీనివాస్ మాట్లాడుతూ.. మాదిగలకు స్మశాన వాటిక, ఏనుగొండలో అంబేడ్కర్ చౌరస్తా ఏర్పాటు చేయాలని అ. కలెక్టర్‌ను కోరారు.