మనస్తాపానికి గురై వ్యక్తి ఆత్మహత్య

VSP: విశాఖలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సబ్‌మెరైన్ వద్ద గురువారం కంచరపాలెంకు చెందిన హరికృష్ణ (45) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలే దీనికి కారణమని తెలుస్తోంది. స్థానికులు, కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.