'సంక్షేమం అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం'
RR: సంక్షేమం అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. గురువారం తలకొండపల్లిలో సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం రోడ్డు షోలో మాట్లాడుతూ.. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఫ్రీ కరెంట్, రేషన్ కార్డులు, సన్న బియ్యం అందించిందని పేర్కొన్నారు.