ట్రాక్టరు ఢీకొని యువకుడి మృతి
VKB: జిల్లా పూడూర్ మండలం ఎన్కేపల్లికి చెందిన హరిశంకర్ గౌడ్(23) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. రాత్రి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న హరిశంకర్ గౌడ్, పత్తి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడని చన్గోముల్ ఎస్సై భరత్ కుమార్ రెడ్డి తెలిపారు. మొదట హత్యగా భావించినప్పటికీ పోలీసుల విచారణలో ఇది రోడ్డు ప్రమాదమేనని నిర్ధారించి చెప్పారు.