శ్రీ రుక్మిణి-సత్యభామల కల్యాణోత్సవానికి ఏర్పాట్లు
WGL: రాయపర్తి మండలం కొండాపురంలోని చారిత్రక శ్రీ రుక్మిణి సత్యభామ సమేత చెన్నకేశవ స్వామి ఆలయంలో హోలీ పర్వదినం రోజు జరిగే స్వామివారి కళ్యాణోత్సవం కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మంగళవారం వేదపండితుల మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల జయజయ ధ్వనుల మధ్య పరిణయ ఘట్టం జరుగుతుంది. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు.