త్వరలో 60 ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు
HYD: నగరంలో త్వరలో 60 ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. కూకట్‌పల్లిలో నూతనంగా నిర్మించిన ఛార్జింగ్ స్టేషన్‌ను ప్రారంభించిన రోజే వాటిని వినియోగంలోకి తెచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. కూకట్‌పల్లి డిపోలో ప్రస్తుతం ఉన్న 60 పాత బస్సుల్లో కాలం చెల్లినవే ఉండగా వాటిని స్క్రాప్‌నకు పంపాలని యాజమాన్యం నిర్ణయించినట్లు డిపో మేనుజర్ డి. హరి తెలిపారు.