ఎంతటి వారైనా ఉపేక్షించవద్దు: ఎమ్మెల్యే

NLR: బెల్ట్ షాపుల విషయంలో ఉక్కుపాదం మోపుతామని ఈ విషయంలో ఎంతటి వారైనా విడిచిపెట్టేది లేదని ఉదయగిరి MLA కాకర్ల సురేశ్ స్పష్టం చేశారు. వెంకట్రావుపల్లిలో బెల్ట్ షాపు నిర్వహిస్తున్నారని మహిళలు MLAకు ఫిర్యాదు చేశారు. వెంటనే MLA అధికారులతో మాట్లాడారు. బెల్ట్ షాపుల విషయంలో ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని ఆదేశించారు. బెల్ట్ షాపుల నిర్వహణపై అధికారులు ఆరా తీస్తున్నారు.