VIDEO: మాజీ సీఎంని కలిసిన గురజాల నాయకులు

VIDEO: మాజీ సీఎంని కలిసిన గురజాల నాయకులు

PLD: మాజీ సీఎం వైఎస్ జగన్‌ను గురజాల నియోజకవర్గ నాయకులు ఇవాళ కలిశారు. ఈ మేరకు తమపై టీడీపీ నాయకులు చేస్తున్న దాడులను జగన్‌కు వివరించారు. బాధిత కుటుంబాలను జగన్ ఓదార్చి వారిలో ధైర్యాన్ని నింపారు. వారికి న్యాయపరమైన సహాయం అందిస్తామని, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనలను పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.