యూరియా టోకెన్ల కోసం తోపులాట.. రైతుకు గాయాలు

యూరియా టోకెన్ల కోసం తోపులాట.. రైతుకు గాయాలు

MHBD: నెల్లికుదురు మండల కేంద్రంలో ఉన్న కోపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో యూరియా ఎరువుల కొరకు రైతులు శనివారం క్యూలైన్లలో నిల్చున్నారు. వారం రోజులుగా తిరుగుతున్న యూరియా దొరకడం లేదని వారు అసహనం వ్యక్తం చేశారు. రైతుల మధ్య యూరియా కోసం తీసుకున్న టోకెన్ల కోసం తోపులాట జ‌రగగా, ఆ సమయంలో ఒక రైతు క్రింద పడడంతో రైతుకు స్వల్ప గాయాలు అయ్యాయి.