బాధ్యతలు మరచి.. బాల్యంలోకి..!
ADB: బాల్యం ఎంతో హాయిగా గడుస్తుంది. వయసు పెరిగే కొద్దీ బాధ్యతలు పెరుగుతాయి. అవన్నీ మరచిపోవడానికి నిర్మల్‌కు చెందిన 1974-75 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు 'రైసర్స్' పేరుతో ఒక వేదికపై కలుసుకున్నారు. అక్కడ గిల్లిదండ, గోటీలాట, కట్టెపుల్ల ఆట, కచ్చకాయలు, పచ్చీస్ వంటి ఆటలతో అందరూ చిన్న పిల్లల్ల మారారు. ఈ ఒక్కరోజు అన్ని మరచిపోయి ఉల్లాసంగా గడిపినట్లు వారు పేర్కొన్నారు.