'పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం'
PDPL: ఓదెల మండలం పొత్కపల్లి గ్రామంలోని సింగిల్ విండో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 35 లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ రూ. 35,04,060 విలువైన చెక్కులను ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లూడుతూ.. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.