కన్నవారిని వదిలేస్తే కఠిన చర్యలు: సీపీ
HYD: వృద్ధాప్యంలోని తల్లిదండ్రులను సొంత బిడ్డలే అనాథలుగా వదిలేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని సీపీ సజ్జనార్ అన్నారు. 'తల్లిదండ్రుల బాగోగులు చూడటం బిడ్డల కనీస ధర్మం. ఇది చర్చలకు తావులేని వారి హక్కు. ఈ విషయంలో ఎలాంటి సాకులకు, సమర్థనలకు ఆస్కారం లేదు. వృద్ధుల పట్ల నిర్లక్ష్యం వహించినా, హింసించినా ఉపేక్షించేది లేదు' అని ఆయన పేర్కొన్నారు.