VIDEO: ఆళ్లగడ్డలో క్రైస్తవుల భారీ ర్యాలీ
NDL: ఆళ్లగడ్డలో శనివారం క్రైస్తవ సోదరులు భారీగా ర్యాలీ నిర్వహించారు. సీఎస్ఐ చర్చి నుంచి మెయిన్ బజార్ మీదుగా ఇమ్మానియేల్ చర్చి వరకు యాత్ర సాగింది. మున్సిపల్ కార్యాలయం వద్ద జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో టౌన్ ఎస్సై శ్రీనివాస గౌడ్ పాల్గొన్నారు. ఎమ్మార్వో కార్యాలయం, బస్టాండ్ ప్రాంతాల్లో సాగిన ర్యాలీలో భక్తులు ప్రార్థనలు చేస్తూ క్రీస్తును స్మరించారు.