నన్నయ యూనివర్సిటీలో విద్యార్థుల ఘర్షణ

నన్నయ యూనివర్సిటీలో విద్యార్థుల ఘర్షణ

AP: రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మెస్ బిల్లు పెంపును ప్రశ్నించిన బీటెక్ జూనియర్లపై సీనియర్లు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. గతంలోనే వీరిపై ర్యాగింగ్ కేసులు ఉన్నా యాజమాన్యం సరైన చర్యలు తీసుకోకపోవడంతోనే ఈ దారుణ పరిస్థితి తలెత్తిందని బాధితులు ఆరోపిస్తున్నారు.