VIDEO: మదనపల్లెలో ఆటోలపై స్పెషల్ డ్రైవ్
అన్నమయ్య: మదనపల్లి జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అధికారి అశోక్ ప్రతాప్ రావు ఆధ్వర్యంలో అమ్మ చెరువు మిట్ట వద్ద శనివారం వాహనాల తనిఖీ జరిగింది. ఈ తనిఖీలో MVIలు దినేష్ చంద్ర, శ్రీహరి, శివలింగయ్య ఆటోలకు అమర్చిన డాజిల్ లైట్లు, ఎయిర్ హారన్లు, వెనుక బంపర్లను తొలగించారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించని వారిపై భారీ జరిమానాలు విధించడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.