తాళం పగలకొట్టి బంగారు నగలు అపహరణ

తాళం పగలకొట్టి బంగారు నగలు అపహరణ

గుంటూరు: మాచర్ల పట్టణంలో మంగళవారం తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. బంగారం, నగదు అపహరించారు. పట్టణంలోని నెహ్రూనగర్‌కు చెందిన రవణమ్మ ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లింది. తిరిగి వచ్చేసరికి తాళం పగులకొట్టి ఉండడంతో ఇంట్లోకి వెళ్లి చూడగా రూ.30 వేల నగదు, చెవిదిద్దులు, గొలుసు అపహరణకు గురైనట్లు గుర్తించి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.