'యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి'
MDK: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని రామాయంపేట రెండవ ఎస్సై అరవింద్ కుమార్ సూచించారు. మంగళవారం స్నేహ జూనియర్ కళాశాలలో గంజాయి, డ్రగ్స్ నివారణ కోసం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మత్తు పదార్థాలు సేవించిన, అక్రమంగా రవాణా చేసిన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సైబర్ నేరాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.