ప్రమాద బీమా క్లెయిమ్ చెక్కు అందించిన ఎమ్మెల్యే

NTR: కార్యకర్తలకు టీడీపీ అండగా ఉంటోందని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. శనివారం విజయవాడ 21వ డివిజన్ కృష్ణలంకలో నివాసం ఉండే టీడీపీ కార్యకర్త విష్ణుభట్ల సుబ్బరామశాస్త్రి బస్సు ప్రమాదంలో మరణించారు. దీంతో ఆయన భార్య శ్రీలక్ష్మికి ప్రమాద బీమా పథకం ద్వారా రూ.5లక్షల చెక్కును శాసనసభ్యులు స్వయంగా అందజేశారు.