ఉరవకొండ మండలంలో రోడ్డు ప్రమాదం

ఉరవకొండ మండలంలో రోడ్డు ప్రమాదం

అనంతపురం: ఉరవకొండ మండలం పెన్నహోబిలం సమీపంలో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన బొలెరో వాహనం నిలిపి మధ్యలో రాళ్లు పెట్టడంతో ఉరవకొండ నుంచి మదనపల్లికి బైక్‌పై వెళ్తున్న గిరీష్ బాబు, ఆంజనేయులు వాటిని ఎక్కించి కిందపడ్డారు. స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చారు.