గణనాథుని ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ

గణనాథుని ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ

CTR: పులిచెర్ల మండలం రాయవారి పల్లెలో గణనాథుని ఆలయ పునర్నిర్మాణం పనులకు గురువారం ఉదయం గ్రామస్థులు భూమి పూజ నిర్వహించారు. ఆలయ నిర్మాణం ప్రాంగణంలో వేకువజాము నుంచే ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛోరణల నడుమ భూమి పూజ జరిగింది. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ నిర్మాణం పనులను వేగవంతం చేస్తామని గ్రామస్థులు తెలిపారు.