రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

నల్గొండ జిల్లా తిప్పర్తిలోని అంతయ్యగూడెంలో ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పల్లా రాంరెడ్డి అనే వ్యక్తి  కేఆర్ఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో రోడ్డు దాడుతుండగా, మిర్యాలగూడ వైపు నుంచి అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాంరెడ్డి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.