తిరుమల లడ్డు కల్తీ నెయ్యిపై కూటమి నాయకుల నిరసన
CTR: పుంగనూరు పట్టణంలోని కోనేరు వద్ద కూటమి నాయకులు తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంపై నిరసన వ్యక్తం చేశారు. నాయకులు మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పాలు లేకుండా కెమికల్ వాడి కల్తీ నెయ్యి తయారు చేసి స్వామివారి కైంకర్యాలకు, లడ్డూ ప్రసాదం తయారీలలో వాడారని ఆరోపించారు. రానున్న రోజుల్లో వైసీపీ భూస్థాపితం కావడం ఖాయమని తెలిపారు.