నిజామాబాద్ నగరపాలక కమిషనర్‌గా యాదగిరిరావు

NZB : నగర పాలక సంస్థ నూతన కమిషనర్‌గా డాక్టర్ ఎన్.యాదగిరిరావు నియమితులయ్యారు. రాష్ట్రంలోని పలు కార్పొరేషన్ల కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్‌గా వెయిటింగ్‌లో ఉన్న యాదగిరిరావును ఇక్కడికి బదిలీ చేశారు.