టికెట్ ధరల పెంపుపై సుప్రీం కీలక ఆదేశాలు
సినిమా టికెట్ల ధరలను పెంచడంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సామాన్య ప్రజలు ఒక సినిమా చూడాలంటే రూ.2 వేలు ఖర్చు చేయాల్సి వస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఒక వాటర్ బాటిల్‌కు రూ.100 వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. టికెట్ ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వాలు విధివిధానాలు రూపొందించాలని సుప్రీం ఆదేశించింది. ఈ ధరలను రూ.200కు పరిమితం చేయాలని ప్రతిపాదించింది.