వివాహిత అదృశ్యం.. కేసు నమోదు

వివాహిత అదృశ్యం.. కేసు నమోదు

WNP: ఓ వివాహిత అదృశ్యమైన ఘటన గోపాల్ పేట మండలంలో చోటుచేసుకుంది. ఏదుట్ల గ్రామానికి చెందిన పల్లె అరుంధతి కనిపించడం లేదని ఆమె భర్త భోగది మహేష్ శనివారం గోపాల్ పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 2019లో ప్రేమ వివాహం చేసుకున్న అరుంధతి గత ఐదు నెలలుగా వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర సాయి మెస్‌లో పని చేస్తోంది. నవంబర్ 21 ఉదయం పనికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.