త్రాగునీటి సమస్యతో కొండమూది ప్రజలు అవస్థలు

GNTR: పొన్నూరు మండలంలోని కొండమూది గ్రామంలో ఈ ఏడాది త్రాగునీటి సమస్య జటిలమైంది. గ్రామంలో చేపలు పట్టేందుకు నీరు తోడి వేయటంతో గత డిసెంబర్ నుండి గ్రామ ప్రజలు త్రాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్వచ్ఛంద సంస్థల వారు ప్రతి రోజు ట్యాంకర్లు ద్వారా నీటిని గ్రామ ప్రజలకు అందిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.