‘SC, STలకు సూర్యఘర్ కనెక్షన్లు ఫ్రీ’
AP: PM సూర్యఘర్ పథకం ద్వారా విద్యుత్ వినియోగదారులకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రతి నియోజకవర్గంలో 10 వేల కనెక్షన్లు ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఈ పథకం ద్వారా SC, STలకు పూర్తి ఉచితంగా.. BCలకు ప్రత్యేక రాయితీలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఫలితంగా ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం తగ్గనుందని చెప్పారు.