గోలాపురంలో వైసీపీలోకి చేరిన జనసేన కార్యకర్తలు

గోలాపురంలో వైసీపీలోకి చేరిన జనసేన కార్యకర్తలు

సత్యసాయి: హిందూపురం రూరల్ మండలం గోలాపురం గ్రామానికి చెందిన జనసేన కార్యకర్తల జనసేన నుంచి వైసీపీలోకి చేరారు. ఈ సందర్భంగా హిందూపురం వైసీపీ ఇంఛార్జ్ దీపిక బుధవారం వారికి పార్టీ కండవాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలోకి చేరిన వారిలో హరి, విజయ్ కుమార్, తదితరులు ఉన్నారు. వైసీపీ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆమె సూచించారు.