రోడ్డు ప్రమాదం.. విద్యార్థి మృతి
TPT: చంద్రగిరి మండలం కోదండరామాపురం సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. బంగారుపాళ్యానికి చెందిన లక్ష్మీకాంత్ చిత్తూరు సమీపంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. బైక్‌పై తిరుపతికి వచ్చే క్రమంలో లారీని ఢీకొన్నాడు. ప్రమాదంలో విద్యార్థి అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.