రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
WGL: నర్సంపేట పట్టణంలోని మాదన్నపేట రోడ్డులో రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని ఆకాంక్షించారు. మైనార్టీల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం పని చేస్తుందన్నారు.