గిద్దలూరులో నేడు ఆధార్ క్యాంప్ ప్రారంభం

ప్రకాశం: విద్యార్థులు, ప్రజల ఇబ్బందులు గ్రహించిన ప్రభుత్వం నూతన ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. గిద్దలూరులోని సెయింట్ పాల్స్ పాఠశాలలో శుక్రవారం నుంచి నూతన ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారని, కావున మండలంలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ తెలిపారు.