సత్యనారాయణస్వామి దేవస్థానం కమిటీ రాజీనామాలు

E.G: రాజమండ్రి పట్టణం ఆర్యాపురంలో వేంచేసియున్న శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం పాలకమండలి కమిటీ మంగళవారం రాజీనామా చేశారు. ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో పలువురు తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు. ఈ సందర్భంగా పాలక మండలి చైర్మన్ సురేష్, డైరెక్టర్లు తమ రాజీనామా పత్రాలను ఈవో సత్యవేణికి అందించినట్లు తెలిపారు.