హాస్పిటల్ నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి

హాస్పిటల్ నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి

SRCL: ఎల్లారెడ్డిపేట మండలంలోని కిష్టునాయక్ తండాకు చెందిన భూక్య వెన్నెల ప్రవీణ్‌కు ఆరు రోజుల కిందట బాబు జన్మించాడు. కాగా, మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కిష్టునాయక్ తండాలో 8వ వార్డ్ మెంబర్గా వెన్నెల బరిలో నిలిచారు. పోలింగ్ కావడంతో దవాఖాన నుంచి నేరుగా తన పసిబిడ్డతో పోలింగ్ కేంద్రానికి చేరుకొని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.