VIDEO: వాట్సాప్ సేవల పేరుతో ప్రభుత్వం మోసం
కృష్ణా: వాట్సాప్ సేవల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర రైతు విభాగ అధ్యక్షులు రాంప్రసాద్ ఆరోపించారు. గురువారం ఆయన ఉయ్యూరులో మాట్లాడుతూ.. రైతులు బ్యాంకు లోన్‌కు వెళ్లినప్పుడు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీపై కూడా అదనపు చార్జీలు విధిస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై ఆధారాలతో ప్రజాక్షేత్రంలో చర్చకు సిద్ధమన్నారు.