నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టుకు హాజరైన ఎమ్మెల్యే

NGKL: అసెంబ్లీ ఎన్నికల సమయంలో నియోజకవర్గంలోని వివిధ మండలాలలో నమోదైన కేసులలో భాగంగా నేడు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ నిమిత్తం అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గురువారం హాజరయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నాపై అక్రమంగా కేసులు బనాయించిందని వంశీకృష్ణ అన్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన కోర్టులో హాజరయ్యారు.