నకిలీ కాల్ సెంటర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ
పల్నాడు జిల్లా ఎస్పీ బి. కృష్ణరావు నకిలీ కాల్ సెంటర్ల మోసాలపై ప్రజలను అప్రమత్తం చేశారు. తెలియని కస్టమర్ కేర్ నంబర్లను నమ్మవద్దని, అధికారిక వెబ్‌సైట్లలోనే వివరాలు చూడాలని మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. ఓటీపీ, బ్యాంక్ వివరాలు ఎవరికీ చెప్పరాదని స్పష్టం చేశారు. మోసపోయిన వారు వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.