VIDEO: అగ్నిప్రమాదం.. వృద్ధురాలు సజీవదహనం

VIDEO: అగ్నిప్రమాదం.. వృద్ధురాలు సజీవదహనం

VZM: తెర్లాం మండలం చినగొలుగువలసలో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పది ఇళ్లు దగ్ధమవ్వగా వృద్ధురాలు సజీవదహనం అయింది. అందరూ నిద్రపోతున్న సమయంలో ఇళ్లకు నిప్పు అంటడంతో ఇళ్లలో ఉన్నవారు బయటకు వచ్చేశారు. ఓ ఇంట్లో ఉన్న వృద్ధురాలు కె.పాపమ్మ బయటకు రాలేకపోవడంతో సజీవదహనం అయిందని స్థానికులు తెలిపారు. బాధితులను ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.