రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

పెద్దపల్లి మండలంలోని ధర్మారం క్రాస్ రోడ్ వద్ద కారు ఢీకొట్టడంతో పిడుగు గోపాల్ (49) అనే కాంట్రాక్టు కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఎఫ్సీఐ ఎరువుల కర్మాగారంలో పనిచేస్తున్న గోపాల్, ఉదయం ద్విచక్రవాహనంపై విధులకు వెళ్తుండగా, పెద్దపల్లి నుంచి గోదావరిఖని వైపు వస్తున్న కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.