'గ్రామాల అభివృద్ధికి సహకరించండి'
NLG: త్రిపురారంలోని నీలాయిగూడెం,అంజనపల్లి గ్రామస్తులు TDP మండల అధ్యక్షుడు సబ్బు బలరామిరెడ్డి ఆధ్వర్యంలో నేడు ప్రజా నాయకుడు పాండురంగారెడ్డిని కలిశారు. గ్రామాల్లో ఉన్న ప్రధాన సమస్యలను ఆయనకు వివరించి, వాటి పరిష్కారానికి చొరవ చూపాలని విన్నవించారు. గ్రామాల్లో నెలకొన్న మౌలిక సమస్యల పరిష్కారానికి కృషిచేసి అభివృద్ధికి సహకరించాలని గ్రామస్తులు ఆయనను కోరారు.