ఈ నెల 19న తెలుగు జాతి పరిరక్షణ సమితి ఆవిర్భావ వేడుక
GNTR: "తెలుగు జాతి పరిరక్షణ సమితి" ఆవిర్భావ వేడుకను ఈ నెల 19న విజయవాడలో నిర్వహించనున్నట్లు సమితి అధ్యక్షుడు అన్నాబత్తుని సదాశివరావు వెల్లడించారు. తెనాలిలో ఈ కార్యక్రమ పోస్టర్లను ఇవాళ ఆవిష్కరించిన ఆయన, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఏకం చేసే వేదికగా ఈ సమితి పనిచేస్తుందని తెలిపారు.