'శుద్ధి చేసిన నీటిని అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం'
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సౌకర్యం ఉంది. అయితే తాగేందుకు శుద్ధి చేసిన నీటిని అందించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో విద్యార్థులు నల్లానీరు, చేతి పంపులపైనే ఆధారపడి గొంతు తడుపుకొంటున్నారు. అధికారులు స్పందించి తక్షణమే శుద్ధి చేసిన నీటిని అందించాలని కోరారు.