'ఈనెల 25లోగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి'

అల్లూరి: చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయని కళాశాల ప్రిన్సిపాల్ ఎం.విజయ భారతి తెలిపారు. విద్యార్థులు ఈనెల 25వ తేదీవరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. బీఏ ఎకనామిక్స్, హిస్టరీ, బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ గ్రూపులు అందుబాటులో ఉన్నాయన్నారు.