సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

సత్యసాయి: ఆర్థిక స్థోమత లేక అనారోగ్యాల బారిన పడుతున్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో దోహదపడుతుందని మంత్రి సవిత తెలిపారు. ఆదివారం పెనుకొండలో మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి సవిత చేతుల మీదుగా 34 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. రూ.19,52,195 లక్షలు విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు.